శనివారం, పెదపాడు మండలంలోని కలపర్రు, ఏపూరు, అప్పన్నవీడు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 35,571 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, వారి కోసం ₹. 15,81,99,500 మొత్తాన్ని అందించేలా చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. దాదాపు 90% పైగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.