మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గురువారం పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న 75 కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. త్వరలోనే వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.