పెదవేగి మండలం దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలు గ్రామాలకు చెందిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.