మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో నారా లోకేష్ కు, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో పార్టీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.