రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి UPDATE

4చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి UPDATE
పెదవేగి మండలం జానంపేట ఎఫ్సీఐ గోడౌన్స్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతులు ఏలూరు శివారు బీడీ కాలనీకి చెందిన బొంతు దుర్గాప్రసాద్ (26), షేక్ అహ్మద్ (25), చిట్టి ఆంజనేయులు (24). వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. సోమవారం పనులు మానేసి సరదాగా ద్విచక్ర వాహనంపై బలివే వెళ్లి, తమ్మిలేరులో గడిపి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, బైక్ స్పీడోమీటర్ 70-80 మధ్య ఆగిపోయిందని సమాచారం. దుర్గాప్రసాద్‌కు ఇద్దరు పిల్లలు, అహ్మద్‌కు ఏడాది కుమారుడు ఉండగా, ఆంజనేయులుకు వివాహం కాలేదు. వారి మృతితో కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

సంబంధిత పోస్ట్