ఏలూరు - Eluru

ఎంపీకి మద్దతుగా వెలసిన ఫ్లెక్సీలు

హైదరాబాద్ లో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్‌కు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆతరవాత తనను ఎప్పటి నుంచో కలవాలనుకున్న వారి విజ్ఞప్తి మేరకు వారిని కలిసేందుకే తాను మొయినాబాద్‌ కు విందుకు వెళ్లినట్లు ఎంపీ ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎటువంటి దురాలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎలాంటి తప్పు చేయలేదని మేము మీతో ఉన్నాం, ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది అంటూ ఎంపీ పుట్ట మహేశ్ కు మద్దతుగా ఏలూరులో ఫ్లెక్సీలు వెలిశాయి.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా