ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ను నూతన ఏఎస్పీ సుస్మిత, ఐపీఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మితకి ఎస్పీ శాంతి భద్రతలు, నేర నియంత్రణ వ్యూహాలపై మార్గదర్శకాలు అందించారు. సుస్మిత ఎస్పీ సూచనలను పాటించి సమర్థవంతంగా ప్రజల సేవలో పనిచేస్తానని తెలిపారు.