నూతన సంవత్సరంలో భక్తులతో కిటకి లాడిన చిన వెంకన్న క్షేత్రం

2చూసినవారు
నూతన సంవత్సరంలో భక్తులతో కిటకి లాడిన చిన వెంకన్న క్షేత్రం
ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం నూతన ఆంగ్ల సంవత్సరంలో భక్తులతో కిటకిటలాడింది. న్యూ ఇయర్ రోజును స్వామిని దర్శించుకొని ప్రారంభించాలన్న ఆకాంక్షతో బుధవారం సాయంత్రానికే పినకడిమి ప్రాంతం నుండి భక్తులు పాదయాత్రగా ఆలయానికి చేరారు. కొత్త సంవత్సరం శుభదాయకంగా సాగాలని కోరుకుని, వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిధిలో భక్తుల సందడి నెలకొని, ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్