దివ్యాంగుల విద్యపై జిల్లా విద్యాశాఖ అధికారి కీలక వ్యాఖ్యలు

781చూసినవారు
దివ్యాంగుల విద్యపై జిల్లా విద్యాశాఖ అధికారి కీలక వ్యాఖ్యలు
ఏలూరులోని జిల్లా దివ్యాంగుల పునరావస కేంద్రం, పరివర్తన్ బధిరుల పాఠశాల సంయుక్తంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్, డి.సి.ఇ.బి ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ. సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ఎం.వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ, దివ్యాంగులు అందరితో సమానంగా విద్యను అభ్యసించాలని, చదువుతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్