ఏలూరు: రైతుల ఆశలపై నీళ్లు చల్లిన పరిస్థితి ఏర్పడింది

7చూసినవారు
ఏలూరు: రైతుల ఆశలపై నీళ్లు చల్లిన పరిస్థితి ఏర్పడింది
ఏలూరు జిల్లా పరిధిలో కోకో సిటీ ఏర్పాటు చేస్తామని కోకో రైతులకు ఆశలు కల్పించి, తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించడం వలన ఇక్కడ రైతుల ఆశలపై నీళ్లు చల్లిన పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో ఆయన కోకో రైతుల సమస్యలపై మాట్లాడారు. కోకోసిటీ ఏలూరు జిల్లాకు ఒక వరం అంటూ ప్రచారం చేసి, ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్