స్థానిక 7వ డివిజన్ బెనర్జీ పేటలోని పాండురంగ థియేటర్ వద్ద ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, అన్ని దానాల్లో కన్న అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.