ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జునరావు, బుధవారం ఘంటా పద్మశ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు చైర్‌పర్సన్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, జిల్లాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామ పంచాయతీలలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, హరితహారం, గ్రామాల పరిశుభ్రత, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు.