ఏలూరు: అసత్య ప్రచారాలపై డిఎస్పీ హెచ్చరిక

9చూసినవారు
ఏలూరు: అసత్య ప్రచారాలపై డిఎస్పీ హెచ్చరిక
ఏలూరు 12 పంపుల సెంటర్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వివాహితపై అఘాయిత్యం జరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మంగళవారం ఖండించారు. సోమవారం రాత్రి 112కు సమాచారం అందగా, పోలీసులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. అయితే ఈ ఘటనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్