ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని వట్లూరు సమీపంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ (72) అనే వృద్ధుడు రైలు నుంచి జారిపడి మృతి చెందారు. ఆయన బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు పుణ్యక్షేత్రాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.