ప్రజలకు మంచినీరు అందించేందుకు ఆదివారం పేట సాయిబాబా గుడి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి తొలగించారని నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆరోపించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేసిన సేవకు అడ్డంకులు సృష్టించడం సరికాదని, ఫ్లెక్సీలు తీసేసినా జగన్ ప్రజాదరణ తగ్గదని ఆయన అన్నారు. సేవ చేసే మనసుంటే అడ్డంకులు పెట్టరని ఆయన పేర్కొన్నారు.