ఏలూరు తూర్పువీధిలో శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ పోతురాజుబాబుల జాతర మహోత్సవానికి శుక్రవారం ముడుపు కట్టే కార్యక్రమంతో అంకురార్పణ జరిగింది. ఈ ఘన చారిత్రక ఉత్సవానికి అంకురార్పణ చేయడం ఆనందంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.