ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా, ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు రైతులకు అందేలా రైతు సంఘం పనిచేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతోందని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో జరిగింది.