ఏలూరులోని మోతేవారితోటకు చెందిన దుర్గారావు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఏప్రిల్ 30న ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి రాలేదు. భార్య లక్ష్మితో మనస్పర్థల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల మణిదీప్, ఏడేళ్ల నిహారిత్‌తో కలిసి వెళ్లిన దుర్గారావు జాడలేకపోవడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.