ఏలూరులోని ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం నుంచి నగదు డ్రా చేసిన ఒక ఖాతాదారుడికి ఇంకు పడిన నోట్లు వచ్చాయి. రూ.9 వేలు డ్రా చేయగా, నోట్ల నిండా ఇంకు ఉండటంతో అతను విస్తుపోయాడు. మిషన్‌లో తిరిగి డిపాజిట్ చేయగా కేవలం రూ.2 వేలే తీసుకుంది. బ్యాంకును సంప్రదించగా, వేరే నోట్లు అందించారు. ఈ సంఘటనతో స్థానికులు ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడానికి భయపడుతున్నారు.