వ్యయ ప్రయాసలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని ఉమ్మడి ప.గో. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోర్టులలో నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షీదారులకు లోక్ అదాలత్ ఒక వేదిక అని అన్నారు.