హనుమాన్ నగర్ వంతెన వద్ద రైలు పట్టాలు దాటుతుండగా, కుప్పాల లీలా కుమార్ (45) అనే వ్యక్తి రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నట్లు సమాచారం. రైల్వే ఎస్సై దానం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.