బీహార్ రాష్ట్రానికి చెందిన జార్జ్స్ ఆలం (22) అనే వ్యక్తి ఏలూరులోని పవర్ పేట క్రాఫ్ట్ బజార్ లో గాజుల వ్యాపారం చేస్తున్నాడు. బుధవారం ఉదయం సమీప రైలు పట్టాల వెంబడి బహిర్భూమికి వెళుతున్న సమయంలో రైలు ఢీకొని మృతి చెందాడని రైల్వే ఎస్సై సైమన్ తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.