ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో 140వ మేడే వాల్ పోస్టల
్ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా IFTU అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ సెక్రటరీ యర్రా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, హమాలి కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని, పని ప్రదేశాల్లో ప్రమాదాలను అరికట్టాలని, 8 గంటల పని దినాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.