ఏలూరు 34వ డివిజన్ గూడ్స్ షెడ్ రోడ్డులో సుమారు ₹. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రహదారిని నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి కూడా పాల్గొన్నారు.