ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్‌రావుతో కలిసి
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి
ఎన్టీఆర్ అని కలెక్టర్ కొనియాడారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు
ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని ఆమె గుర్తుచేశారు.