ఏలూరు: ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులకు సత్కారం

1చూసినవారు
ఏలూరు: ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులకు సత్కారం
ఏలూరు జిల్లా పోలీస్ శాఖలో హోం గార్డ్ యూనిట్ నుండి ఉద్యోగ విరమణ చేసిన ముగ్గురు హోం గార్డులను బుధవారం ఘనంగా సత్కరించారు. వీరిలో ఉయ్యాల లక్ష్మి, సిలారపు వెంకటేశ్వరరావు, ఏ. వెంకటేశ్వరరావు ఉన్నారు. అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూర్యచంద్రరావు వీరిని శాలువాలతో సన్మానించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్