ఏలూరు రూరల్ మండలం తంగళ్ళమూడి పంచాయతీ పరిధిలోగల జాతీయ రహదారిపై అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సివిల్ సప్లై అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని 258 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వాహన యజమాని మరియు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.