ఏలూరు: తల్లీకుమార్తెల హత్య కేసులో వీడిన చిక్కుముడి

4చూసినవారు
ఏలూరు: తల్లీకుమార్తెల హత్య కేసులో వీడిన చిక్కుముడి
ఏలూరు జిల్లాలో జరిగిన తల్లీకుమార్తెల హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతపల్లికి చెందిన గంటా అంతోబాయి(60), ఆమె కుమార్తె మద్దా వెంకటలక్ష్మి(46) నల్లమాడులోని జీడి మామిడి తోటలో హత్యకు గురయ్యారు. దూబచర్లలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మద్యంలో గుళికలు కలిపి తాగించి, మత్తులోకి జారుకున్నాక హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తల్లీకుమార్తెల వల్ల గతంలో ఆర్థికంగా నష్టపోవడంతో కక్ష పెంచుకుని హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితురాలిని గురువారం రిమాండ్కు తరలించనున్నట్లు సమాచారం.