ఏలూరు: డీజిల్ కు ఎటువంటి కొరత లేదు

1175చూసినవారు
ఏలూరు: డీజిల్ కు ఎటువంటి కొరత లేదు
ఏలూరు జిల్లాలో డీజిల్ కొరత అనే వార్త కేవలం కల్పితమని, డీజిల్ కు ఎటువంటి కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు చేరుకోవడం వల్లే డీజిల్ డ్రై అవుట్లు జరుగుతున్నాయని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే 65 బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలను పునరుద్ధరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్