కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడిందని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏలూరులోని పవర్ పేటలో గల ఖాళీ హెచ్. పి పెట్రోల్ బంకు వద్ద ఐ.ఎఫ్.టి.యు కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు.
అమెరికా, ఇరాన్ యుద్ధం ముగిసినా పెట్రోలు, డీజిల్ కొరత తగ్గలేదని వారు పేర్కొన్నారు.