తెలంగాణ ఎమ్మెల్యేలు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు కేవలం పబ్లిసిటీ కోసమేనని ఏలూరు నియోజకవర్గ
జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. కొందరు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన శనివారం మీడియాతో తెలిపారు. ఎలాంటి ఆపద వచ్చినా, కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పవన్ అని ఆయన అన్నారు.