ఏలూరు రూరల్ మండలం మహేశ్వర దుర్గపురానికి చెందిన మద్దుల ఝాన్సీ (25) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం బైక్‌పై ఏలూరు వస్తుండగా, చేపల లోడుతో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందింది. రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.