ఏలూరులోని సాక్షి కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు మంగళవారం నిరసన చేపట్టారు. అయితే ఆ సమయంలో కార్యాలయం నుంచి మంటలు చెలరేగాయి. అప్రమతమై పోలీసులు మంటలను అదుపు చేశారు. తాము నిరసనకు వస్తున్నామని తెలిసి కుట్రలో భాగంగానే అగ్ని ప్రమాదం సృష్టించారని మహిళలు ఆరోపించారు. తాము కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో ఉండగానే మంటలు చెలరేగాయి వివరించారు.