ఏలూరు అపార్ట్‌మెంట్‌ లో అగ్నిప్రమాదం

62చూసినవారు
ఏలూరు అపార్ట్‌మెంట్‌ లో అగ్నిప్రమాదం
ఏలూరులోని శాంతినగర్ 7వ రోడ్డులో ఆక్స్ఫర్డ్ పాఠశాల ప్రక్కనే ఏమని అపార్ట్మెంట్ ఫోర్ బి ప్లాట్లో శనివారం టీవీ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు హాలు, బెడ్ రూమ్, కిచెన్లలో ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ సమయంలో దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఐదుగురిని సురక్షితంగా బయటకు తెచ్చారు

సంబంధిత పోస్ట్