ఏలూరు జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరం

1చూసినవారు
ఏలూరు జిల్లాలో ధాన్యం సేకరణ ముమ్మరం
ఏలూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరుగుతోందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ గురువారం తెలిపారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1,54,386 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొనుగోలులో ఏవైనా సమస్యలు ఎదురైతే 18004256453, 7702003584 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్