ఏలూరు: ద్వారకాతిరుమల స్వామి సన్నిధిలో శ్రీకృష్ణ అవతారం

81చూసినవారు
ఏలూరు: ద్వారకాతిరుమల స్వామి సన్నిధిలో శ్రీకృష్ణ అవతారం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురం ఆలయంలో జగన్నాధ స్వామివారు శనివారం కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రుక్మిణి, సత్యభామ సమేత పిల్లనగ్రోవితో ఉన్న స్వామివారి అలంకారం భక్తులకు కనువిందు చేసింది. ఆలయంలో జరుగుతున్న జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి వారు రోజుకు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

సంబంధిత పోస్ట్