గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ధర్మరాజు సమీక్ష, సీఎంకు నివేదిక సమర్పణ

0చూసినవారు
గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ధర్మరాజు సమీక్ష, సీఎంకు నివేదిక సమర్పణ
ఉంగుటూరు నియోజకవర్గంలోని చేబ్రోలు, గోపినాధపట్నం, గొల్లగూడెం, గోపాలపురం, నల్లమాడు, రామచంద్రపురం, యర్రమిల్లిపాడు గ్రామాలలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రజా ప్రతినిధులు, గ్రామ కూటమి నేతలు, పంచాయతీ కార్యదర్శులు, పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల అభివృద్ధి అవసరాలు, ప్రాధాన్య సమస్యలు, చేపట్టవలసిన పనులపై చర్చించి, ప్రతి పంచాయతీ వారీగా అభివృద్ధి వివరాలను నివేదిక రూపంలో సేకరించారు. ముఖ్యంగా చేబ్రోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికపై చర్చించారు. ప్రజల సమస్యల ఆధారంగా సిద్ధం చేసిన అభివృద్ధి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్