ఏలూరు నగరంలోని 9వ డివిజన్లో బుధవారం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.