ఏలూరు డిపో గ్యారేజీలో శుక్రవారం ఏపీఎస్ఆర్టీసీ 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఆర్టీఓ శేఖర్, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 55 వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, 23 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలని, వాహనాలను దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.