ఏలూరు జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీసుకోవలసిన చర్యలపై సమాచారాన్ని అందించాలని సీఐఐ బృందాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. జిల్లాలో వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణాలు, నష్టాల తీవ్రత తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలు, తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు బుధవారం జిల్లాకు సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) బృంద సభ్యులు విచ్చేసారు.