రైతులకు లాభదాయక వ్యవసాయం: ఎమ్మెల్యే ధర్మరాజు పంచసూత్రాలపై అవగాహన

0చూసినవారు
రైతులకు లాభదాయక వ్యవసాయం: ఎమ్మెల్యే ధర్మరాజు పంచసూత్రాలపై అవగాహన
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోలు, సకాలంలో డబ్బుల చెల్లింపు, సబ్సిడీపై యంత్రాలు, డ్రోన్ల పంపిణీ, లాభదాయక పంటల ప్రోత్సాహం, సాంకేతికతను వ్యవసాయంలో అనుసంధానం చేయడం వంటి సంస్కరణలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, RSK సిబ్బంది, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్