ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌లో ర్యాగింగ్ ఘటన బయటపడింది. మూడో సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. అసభ్యంగా ప్రవర్తించారని సమాచారం. కొద్దిరోజులుగా ర్యాగింగ్ చేస్తున్న మౌనంగా భరించిన వీరు శృతిమించడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు.