ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పశువుల దాణా లారీ నుంచి రోడ్డుపై దాణా ఒలికిపోవడంతో, ద్విచక్ర వాహనం స్కిడ్ అయి, దాని వెనుక వచ్చిన కారును ఢీకొట్టింది. అనంతరం మరో ద్విచక్ర వాహనం, లారీ కూడా కారును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.