ఏలూరులో సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

610చూసినవారు
ఏలూరులో సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ఏలూరులోని దొండపాడ పరివర్తన్ బధిరుల పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. కోఆర్డినేటర్ డి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ దార్శనికత, దేశభక్తి, ధైర్యం నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. స్వతంత్రం అనంతరం 565 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో ఆయన పాత్ర చారిత్రాత్మకమని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you