ఏలూరు నగరంలో ప్రముఖ నగల దుకాణం ప్రారంభ ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ముసునూరు గ్రామానికి చెందిన కే. అభిషేక్‌కు కాలు విరిగింది. ఏలూరులో నగల దుకాణానికి ప్రముఖ కథానాయకుడు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఆయనను చూసేందుకు జరిగిన తోపులాటలో ఈ ఘటన జరిగింది. అతన్ని 108 సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు.