రాష్ట్రంలోని కార్మికులు, కర్షకులు, శ్రామికులు దేశ, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం కార్మికుల, పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆయన అన్నారు.