ఏలూరులో కదం తొక్కిన వివోఏలు

0చూసినవారు
ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం వెలుగు వివోఏలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. రాష్ట్రంలో 2,856 మంది వివోఏలు రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, వారి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. కె. సుభాషిణి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను తీర్చాలని వివోఏలు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్