
కైకలూరు: పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతో తెలుసా
కైకలూరు మండలం కొల్లేటికోటలోని శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపిన వివరాల ప్రకారం, అమ్మవారికి వివిధ రూపాలలో ₹. 36,025 నగదు ఆదాయంగా సమకూరింది.






































