కైకలూరు: ఎడారిలా మారిన పెలికాన్ ప్యారడైజ్

11చూసినవారు
కైకలూరు: ఎడారిలా మారిన పెలికాన్ ప్యారడైజ్
ప్రపంచ ప్రసిద్ధ కొల్లేరు సరస్సు పరిధిలోని ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం అధికారుల నిర్లక్ష్యంతో ఎడారిలా మారుతోందని వన్యప్రాణి ప్రేమికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు పరిధిలోని 286 ఎకరాల్లో ఉన్న ఈ కేంద్రంలో ప్రస్తుతం చుక్కనీరు లేక నేలలు బీటలు వారాయని వాపోతున్నారు. వేలాది వలస పక్షులు ఆహారం, ఆవాసం దొరకక అల్లాడిపోతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్