కైకలూరు మండలం, కొల్లేటికోటలోని శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయంలో శనివారం అమ్మవారి మండల మాల దీక్షలను భక్తులు స్వీకరించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పెటేటి పరమేశ్వరరావు, గురు పెద్దింటి అమ్మ మరియు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో 46 మందికి పైగా భక్తులు మాలలు ధరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాసు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.